కడప రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స  పొందుతున్న ఎంపీడీవో జవహర్‌బాబును  డిప్యూటీ సీఎం పరామర్శించారు

అనంతరం ఉపముఖ్యమంత్రి  పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు

గతంలో ఎంపీడీవో ప్రతా్‌పరెడ్డి, శేఖర్‌నాయక్‌, శ్రీనివాసులరెడ్డిపై దాడి చేశారు

ఇప్పుడు జవహర్‌బాబుపై దాడి చేశారు. వైసీపీ నేతలకు అహంకారం తలకెక్కింది

తోలుతీసి కూర్చోబెడతాం

ఆధిపత్యపు అహకారంతో దాడిచేస్తే మీ అహంకారాన్ని అణిచేస్తాం అని ఉపముఖ్యమంత్రి పవన్‌ అన్నారు

వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా గాలిలో విహరిస్తున్నారు

11 సీట్లే వచ్చినా అహంకారం తగ్గలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు

కూటమి ప్రభుత్వం త్రికరణశుద్ధితో పనిచేస్తోందని,

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎలా నియంత్రించాలో తెలుసనని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు