ఈ అమావాస్యరోజున ఇలా చేయండి.. జీవితంలో కష్టాలు ఉండవు..
సోమవతి అమావాస్య ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకమైన రోజు. ఈ రోజున మహిళలు ఆది దంపతులైన శివ పార్వతులను పూజిస్తారు.
ఈ రోజున శివపార్వతులను పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని, జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం.
పంచాంగం ప్రకారం మార్గశిర మాసం కృష్ణ పక్షంలోని అమావాస్య తిథి డిసెంబర్ 30 ఉదయం 4:01 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు
డిసెంబర్ 31 తెల్లవారుజామున 3:56 గంటలకు ముగుస్తుంది
సోమవతి అమావాస్య రోజున శివలింగానికి నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి మొదలైన వాటితో అభిషేకం చేయండి.
‘ఓం నమః శివాయ’ అనే మంత్రాన్ని జపించండి.
రావి చెట్టుకు నీరు సమర్పించి దీపం వెలిగించండి.
పూర్వీకులకు తర్పణం సమర్పించడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది.
పార్వతీదేవిని ఆరాధించడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి.
Related Web Stories
సంకటహర చతుర్ధి రోజున గణపతిని ఇలా పూజించండి..
ఐర్లాండ్ లోని శివలింగం చూసారా..
నరసింహస్వామి ఉగ్రరూపాన్ని శాంతింపచేసింది ఇక్కడే..
సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇలా చేయండి..