పెళ్లి, పిల్లలకు సంబంధించిన సమస్యలకు చక్కని పరిష్కారం..సుబ్రహ్మణ్య షష్ఠి!

లోక సంరక్షనార్ధం దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడి అంశతో సుబ్రహ్మణ్యస్వామి జననం. 

 షణ్ముఖుడు, కార్తికేయుడు, కుమారస్వామి ఇలా అనేక పేర్లతో సుబ్రమణ్య స్వామి వారిని పిలుస్తూ ఉంటాము. 

ప్రతీ నెలా షష్టి నాడు విశేషమైన పూజలు, అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు. 

సుబ్రమణ్యం స్వామిని ఆరాధించడం వలన ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

సుబ్రమణ్య స్వామికి ఎర్రని పూలు, ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజ గ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు. 

చాలామంది భక్తులు పాలు, పండ్లు, పూలు, వెండి పడగలు మొక్కుబడులుగా సమర్పిస్తారు.

సుబ్రమణ్య స్వామి ఆరాధన వల్ల కంటికి, చర్మానికి సంబంధించిన రోగాలు తొలగిపోతాయి.

 పెళ్లికానివారు సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే వివాహం జరుగుతుంది.

 సంతానం లేనివారు పూజిస్తే కోరికలు నెరవేరుతాయి.