శ్రీ వెంకటేశ్వర మహత్యం తెలుగు  వారందరికీ తెలిసిన కథ

యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో గొప్పవారెవరో తెలుసుకోమని భృగమహర్షిని పంపుతారు

బ్రహ్మదేవుడు.: సరస్వతీ దేవి గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ  సంగీతంలో సంలీనులై ఉన్నారు

బ్రహ్మకు భూలోకంలో ఆలయాలుండవని శపించిన భృగవు, నేరుగా కైలాసానికి వెళ్ళాడు

భృగమహర్షి వచ్చే సరికి కైలాసంలో శివపార్వతులు నాట్యంలో లీనమై ఉండగా వారితో పాటు గణపతి కుమారస్వామి సహితంగా నందీ భృంగీ రుద్రగాణా పారవశ్యంలో ఉన్నారు

 కైలాసంలో  భృగుమహర్షికి స్వాగత సత్కారాలు లభించలేదని పరమేశ్వరుడి రూపానికి అర్చనలుండ రాదని లింగాకృతికే అర్చనలు అని శపించి వైకుంఠానికి వెళ్ళాడు

వైకుంఠంలో లక్ష్మీవిష్ణువులు మేధస్సు పరంగా చదరంగ క్రీడలో మునిగి ఉన్నారు 

భృగుమహర్షి ఆవేశంతో శ్రీ మహా విష్ణువు వక్షస్థలంపై తన్నినప్పటికీ.. ఆయనను శిక్షించకుండా సముదాయించి పంపినందుకు లక్ష్మిదేవి అవమానంతో బాధపడుతుంది

అవమానం భరించలేక లక్ష్మిదేవి వైకుంఠం విడిచి వెళ్లిపోతుంది