ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే  ఏడాది మహా కుంభమేళా జరగనుంది

ఈ క్రమంలో కుంభమేళాలో రోబోటిక్‌ ఫైర్‌ టెండర్లను ఏర్పాటుచేసినట్లు అధికారులు పేర్కొన్నారు

అత్యవసర సమయాల్లో సిబ్బంది చేరుకోలేని ప్రాంతాలకు వెళ్లేందుకు మూడు రోబోటిక్‌ ఫైర్‌ టెండర్లను ఉపయోగిస్తాం

ఇది ఒక్కొక్కటి 20 నుంచి 25 కిలోల బరువుంటుంది

ఈ రోబోలు మెట్లు ఎక్కడంతో పాటు మంటలను సైతం అదుపు చేస్తాయి

దీంతోపాటు 35 మీటర్ల ఎత్తు నుంచి నీటిని స్ప్రే చేసే ఆర్టిక్యూలేటింగ్‌ వాటర్‌ టవర్‌లు, 

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు ఏర్పాటు చేశాం అని అధికారులు పేర్కొన్నారు

అంతేకాకుండా 200 అగ్నిమాపక కమాండోలను సైతం ఉంచనున్నట్లు తెలిపారు

అగ్నిమాపక కమాండోలు జాతర సమయంలో హై రిస్క్‌ జోన్‌లలో ఉంటారు

గత కుంభమేళాకు రూ.6 కోట్లు కేటాయించగా.. ప్రస్తుతం దాన్ని రూ.67 కోట్లకు పెంచినట్లు తెలిపారు