1906b67c-bb43-447b-be48-fcc4c5ed8f74-10.jpg

శ్రీరామ నవమి రోజు ఈ పనులు చేస్తే  అదృష్టం మీవెంటే..

దేశంలో అత్యధిక మంది హిందువులు శ్రీరాముడిని దేవునిగా కొలుస్తారు. మరికొద్ది రోజుల్లో ఆయన జన్మదినం శ్రీరామ నవమి జరుపుకోనున్నారు.

చైత్ర మాస శుద్ద నవమి.. ఆయన జన్మదినం శ్రీరామనవమి. ఈ వేడుకలను అంతా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.

ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే.. వాడ వాడలా పందిళ్లు వేసి.. శ్రీరాముల వారికి కళ్యాణం నిర్వహిస్తారు.

శ్రీరామనవమి రోజు సూర్యోదయానికి ముందు స్నానం చేసి.. శుభ్రమైన దుస్తులు ధరించాలి

ఇంట్లో శ్రీరామ విగ్రహం లేదా ఆయన చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచాలి. ఆ చిత్ర పటానికి పసుపు,కుంకుమ, పూలు, గంధంతో అర్చన చేయాలి.

అనంతరం "శ్రీ రామ తారక మంత్రం" అయిన..ఓం శ్రీ రామాయ నమఃను కనీసం 108 సార్లు జపించాలి.

పండ్లు, పానకం,వడపప్పు వంటి సాంప్రదాయ వంటలను శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించాలి.

ఈ రోజు.. బీదలకు ఆహారం, బట్టలు లేదా నగదు దానం చేయడం శ్రీరాముని కరుణాకటాక్షానికి పాత్రులమవుతాం.