పౌర్ణమి రోజున ఈ చెట్టును పూజిస్తే  అద్భుత ఫలితం ఉంటుందట..

ఉత్తరేణి మొక్కకు ఆయుర్వేదంలో, జ్యోతిష్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. దీని వేరు, ఆకులు, కాండం, గింజలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి.

పౌర్ణమి రోజున ఈ మొక్కకు పూజ చేయడం వలన, దీని వేరును తాయెత్తుగా ధరించడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతుంటారు.

ఉబ్బసం, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఉత్తరేణి ఎండిన ఆకులను కాల్చి ఆ పొగ పీల్చితే ఉపశమనం లభిస్తుంది.

ఉత్తరేణి గింజల పొడి, ఉప్పు, పటిక పొడి, కర్పూరం కలిపిన మిశ్రమం పంటి నొప్పి, చిగుళ్ళ రక్తస్రావాన్ని తగ్గిస్తుంది.

పౌర్ణమి రోజున ఈ మొక్క మూలానికి పంచోపచార పూజ చేయడం వల్ల జీవితంలోని పెద్ద సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తరేణి వేరును మణికట్టు లేదా చేతిపై తాయెత్తు రూపంలో ధరిస్తే జీవితంలోని ఆటంకాలు తొలగిపోతాయి.

ఉత్తరేణి వేరును ఇంట్లో సురక్షితమైన స్థలంలో ఉంచితే ధనప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి

 ఉత్తరేణి మొక్కను పూజించడం వల్ల ఆధ్యాత్మికంగాను, దీనిని ఔషధంగా ఉపయోగించడం వల్ల శారీరకంగాను ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.