నరసింహస్వామి ఉగ్రరూపాన్ని శాంతింపచేసింది ఇక్కడే.. 

 కడప జిల్లా లోని కమలాపురం నియోజకవర్గం పెండ్లి మర్రి ప్రాంతంలోని వెయ్యి నూతుల కోన ప్రాంతానికి ప్రత్యేక ప్రముఖ్యత ఉంది.

నరసింహా స్వామి వారు హిరణ్యకశిపుడిని వధించి కొండప్రాంతం అయిన ఈ క్షేత్రానికి రావడం జరిగిందని చెబుతారు. 

 దేవతలంతా స్వామి వారి ఉగ్ర రూపాన్ని చల్లబరచాలంటే ఏం చేయాలో అర్థం కాలేదట. చివరకు కొండ పరిసర ప్రాంతంలో వెయ్యి బావులను సృష్టించారట.

 అనంతరం ఆ బావులలోని నీటిని తీసుకువచ్చి స్వామివారి మీద పోస్తూ అభిషేకించారంట. 

ఉగ్రరూపుడైన నరసింహస్వామి చల్లబడలేదని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి . అంతేకాక ఆయన అక్కడ స్వయంభువుగా వెలిశారని భక్తుల విశ్వాసం.

 స్వామి వారు కృతయుగములో ఉద్భవించడం జరిగిందని వేదపురాణాలు చెబుతున్నాయి

 ఈ దేవాలయం అటవీ ప్రాంతంలో ఉంటుంది. అనేకమంది భక్తులు ఇక్కడకు వచ్చి నరసింహస్వామికి మొక్కులను చెల్లించుకుంటారు.

 ఈ దేవాలయం కు వచ్చి దర్శించుకుని వెళితే ఏ పనైనా ఎదురులేకుండా అవుతుందనేది ఇక్కడి భక్తుల నమ్మకం.

  ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఇక్కడ శాంతింపబడి ప్రశాంతంగా ఉంటాడు ఈ దేవాలయమును దర్శించుకోవడం వల్ల చాలా మనశ్శాంతి ఉంటుందని భక్తుల నమ్మకం..