ఉగాది రోజున ఏ టైంలో  వేప పువ్వు పచ్చడి తినాలి?

యుగాది అంటే సంవత్సరాది.. అంటే సంవత్సరం ప్రారంభం అని అర్ధం.. చైత్రమాసం మొదటి రోజున అంటే చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి రోజున కృత యుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి.

హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు సంవత్సరం మొదటి రోజుని ఉగాదిగా తెలుగు ప్రజలు జరుపుకుంటారు.

చైత్ర శుద్ధ పాడ్యమి తిధి 2025 మార్చి 30వ తేదీ ఆదివారం రోజున ఉగాది పండగను జరుపుకోనున్నారు. ఈ రోజు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది.. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొదలు కానుంది.

ఉదయం 9 గం.నుంచి 11.30 గం. కొత్త బట్టలు ధరించి.. యజ్ఞోపవీత ధారణ చేయవచ్చు.  ఈ సముయం ఉగాది పచ్చడి తినడానికి శుభ సమయం అని  పండితులు.చెబుతున్నారు

ఉగాది రోజును శుభప్రదంగా పరిగణిస్తారు.. కనుక ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

ఉగాది రోజున తెల్లవారు జామునే అంటే బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేచి  ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గు వేయాలి

అభ్యంగ స్నానం చేయాలి. అంటే నువ్వుల నూనెతో నలుగు పెట్టుకుని కుంకుడు కాయలతో తలకు స్నానం చేయాలి.

కొత్త బట్టలు మంగళకరం.. కనుక కొత్త బట్టలను ధరించాలి. నుదుట బొట్టుని పెట్టుకోవాలి.గుమ్మాలకు వేప కొమ్మలు, మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి.

దేవుడికి పూజ చేసి వేప పువ్వుతో చేసిన వేప పువ్వు పచ్చడిని తినాలి.