ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది
ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచంగ శ్రవణాన్ని చూస్తారు.
చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు.
సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణలు అంటాయి
చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది.
అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. తెలుుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు.
ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.
బెల్లం తీపి ఆనందానికి ప్రతీక,ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధకలిగించే అనుభవాలు చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు, వగరు కొత్త సవాళ్లు
కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు