సంకటహర చతుర్ధి రోజున గణపతిని ఇలా పూజించండి..

సంకటహర చతుర్థి అనేది హిందూ మతంలో గణేశుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పండుగ. 

ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిధిని సంకటహర చతుర్థిగా జరుపుకుంటారు. ‘సంకటహర’ అంటే ‘సంక్షోభం’ అని, ‘చతుర్థి’ అంటే ‘నాల్గవ రోజు’ అని అర్థం. 

మార్గశిర మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథిని అఖూర్త సంకష్ట చతుర్థి అంటారు. 

 పంచాంగం ప్రకారం మార్గశిర మాసం కృష్ణ పక్ష చతుర్థి తిథి డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10.06 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు 

డిసెంబర్ 19వ తేదీ ఉదయం 10.02 గంటలకు ముగుస్తుంది

ఈ ఏడాది అఖూర్త సంకటహర చతుర్థి ని డిసెంబర్ 18 న జరుపుకుంటారు., 

 ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. పనిలో వచ్చే అడ్డంకులు కూడా తొలగిపోతాయి

 ఈ రోజున వినాయకుడిని పూజించడం వలన అన్ని రకాల కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.