బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా మన ఆటగాళ్లు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2018లో ఫ్యూమాతో రూ.110 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఒక్కొ ఎండార్స్‌మెంట్‌కు విరాట్ కోహ్లీ రూ.3.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు 2019లో చైనీస్ స్పోర్ట్స్ గూడ్స్ జెయింట్, లినింగ్‌తో 4 సంవత్సరాల కాలానికి రూ.50 కోట్ల రూపాయల ఒప్పందంపై సంతకం చేసింది.
జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌తో బహుళ సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసిన మొదటి క్రికెటర్ రిషబ్ పంత్.
నివేదికల ప్రకారం బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా ధోని సంవత్సర ఆదాయం రూ.120 కోట్లకు పైగా ఉంటుంది.
ధోనికి రీబాక్, ఓరియో, డ్రీమ్ 11, స్పార్టన్ స్పోర్ట్స్, గల్ఫ్ ఆయిల్ వంటి పెద్ద బ్రాండ్‌లతో ఒప్పందాలున్నాయి.
స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా సంవత్సరానికి రూ.4 కోట్లు వసూలు చేస్తున్నాడు.