అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెబుతున్నట్లు అశ్విన్ ప్రకటించాడు 

మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అశ్విన్ తన నిర్ణయం ప్రకటించాడు

భారత క్రికెటర్‌గా ఇదే నా చివరి రోజు. అన్ని ఫార్మాట్‌ల నుంచి వీడ్కోలు చెబుతున్నా

క్రికెటర్‌గా నాలో ఇంకాస్త ఆట ఉందని అనుకుంటున్నా. తప్పకుండా క్లబ్‌ క్రికెట్‌లో ఆడతా

అయితే, అంతర్జాతీయ క్రికెటర్‌గా ఇదే నా చివరి రోజు అంటూ అశ్విన్ క్రికెట్‌కూ వీడ్కోలు చెప్పాడు

2011లో వెస్టిండీస్ మీద తన తొలి టెస్ట్‌ మ్యాచ్ ఆడాడీ ఆఫ్ స్పిన్నర్

మొత్తంగా 106 టెస్టులు ఆడిన అశ్విన్.. 537 వికెట్లు తీశాడు

బ్యాట్‌తో 3,503 పరుగులు చేశాడు.6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి

వన్డేల్లో 114 వికెట్లు, టీ20ల్లో 65 వికెట్లు పడగొట్టాడు అశ్విన్

ఓవరాల్‌గా 765 వికెట్లు పడగొట్టాడు అశ్విన్