బాక్సింగ్ డే టెస్టులో యువ ఆటగాడు  నితీష్ సెంచరీ చేశాడు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్ లో జరుగుతోంది

నితీష్ తన మూడో టెస్ట్ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేశాడు

అర్ధ సెంచరీని చేరుకున్నాక నితీష్ పుష్ప సినిమా స్టైల్‌లో తగ్గేదేలే అంటూ ఒక స్టిల్ ఇచ్చాడు

వాషింగ్టన్ సుందర్‌తో కలసి 127 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు

ఈ క్రమంలో నితీష్ మూడంకెల మార్క్‌ను అందుకున్నాడు

అతడు సెంచరీని రీచ్ అవ్వగానే స్టేడియం మొత్తం దద్దరిల్లింది

నితీష్ తండ్రి సంతోషాన్ని తట్టుకోలేక ఏడ్చేశాడు

కామెంట్రీ బాక్స్‌లో వ్యాఖ్యానం చేస్తున్న టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా ఎమోషనల్ అయ్యాడు

నితీష్ 176 బంతుల్లో 10 బౌండరీలు, 1 సిక్స్ సాయంతో 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు

తన ఇన్నింగ్స్ తో ఓటమి అంచున ఉన్న జట్టును కాపాడి.. గెలుపుపై అంచనాలు పెంచాడు నితీష్