మెరుపును మించిన వేగం.. మిల్లీ సెకన్లలో చేసిన అద్భుతం, మనిషా.. రోబోనా..
సీఎస్‌కే సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని మరోమారు ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశాడు.
మెరుపు స్టంపింగ్‌తో పిచ్చెక్కించాడు. ఇది కచ్చితంగా చూసి తీరాల్సిన డిస్మిసల్ అనే చెప్పాలి.
43 ఏళ్ల వయసులోనూ ఫుల్ ఫిట్‌గా ఉన్న మాహీ.. కుర్రాళ్లతో పోటీపడుతున్నాడు.
ఐపీఎల్-2025తో తాను ఎంత ఫిట్‌గా ఉన్నదీ అతడు మరోమారు నిరూపించాడు.
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కళ్లుచెదిరే స్టంపింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు ధోని
స్పిన్నర్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను స్టంపౌట్‌తో వెనక్కి పంపించాడు.
ఇది కేవలం మిల్లీ సెకన్ గ్యాప్‌లో చేయడంతో అంతా గుడ్లు తేలేశారు.
నూర్ వేసిన బంతి గుడ్ లెంగ్త్‌లో పడి ఒక్కసారి అనూహ్యంగా టర్న్ అయింది.
కుడి కాలిని పైకి లేపిన సూర్యకుమార్.. ఎడమ కాలి మీదే భారం పెట్టి ఆఫ్ సైడ్ బంతిని తరలిద్దామని అనుకున్నాడు.
అంతే బంతిని అందుకున్న ధోని.. రెప్పపాటులో బెయిల్స్ పడేశాడు. 0.12 సెకన్ వ్యవధిలో బంతిని అందుకొని స్టంపింగ్ చేసేశాడు.
Related Web Stories
టాటూలు వేసుకున్న భారత క్రికెటర్లు..
సొంత రికార్డును బ్రేక్ చేసిన ఎస్ఆర్హెచ్
ఒక్క నవ్వుతో తగలెట్టేసింది.. కావ్యా పాప అంటే మజా
ఒక్క మాటతో సెంచరీ.. కాటేరమ్మ చిన్న కొడుకు జాతర..