ధోనీ తన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్‌తో కలిసి శిక్షణ అకాడమీని ప్రారంభించాడు.
మొక్కల ఆధారిత మాంసం రూపొందించే వినూత్న ప్లాంట్ ప్రోటీన్ స్టార్టప్ కంపెనీ అయిన షాకా హ్యారీలో ధోనీకి వాటా ఉంది
ఖతాబుక్ అనే క్రికెట్ కంపెనీలో ధోనీ పెట్టుబడులు పెట్టాడు. అదే కంపెనీకి బ్రాండ్ అంబాడిసడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.
ప్రీ-ఓన్డ్ కార్లను అందించే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన Cars24తో ధోనీకి భాగస్వామ్యం ఉంది.
ఝార్ఖండ్ రాజధాని రాంఛీలో ఉన్న విలాసవంతమైన హోటల్ ``మహీ రెసిడెన్సీ``కి ధోనీ యజమాని
ఫిట్‌నెస్ సొల్యూషన్స్ అందించే వ్యాపారంలో కూడా ధోనీ ఉన్నాడు. స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ పేరుతో ధోనీకి దేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ జిమ్‌లు ఉన్నాయి.
క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ధోనీ తన స్వంత ఫామ్ హౌస్‌లో కూరగాయలు, పండ్లు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నాడు. ధోనీ తన సేంద్రయ ఉత్పత్తులను దుబాయ్‌లోని ఓ సంస్థకు విక్రయించినట్టు వార్తలు వచ్చాయి.