భారత జట్టు కెప్టెన్ కాలేకపోయిన ప్రముఖ క్రికెటర్లు వీరే..
304 వన్డేలు, 40 టెస్ట్‌లు, 58 టీ-20లు ఆడిన యువరాజ్ సింగ్ టీమిండియాకు కెప్టెన్ కాలేకపోయాడు. 2007 టీ-20 ప్రపంచకప్ కెప్టెన్‌గా యువీ పేరు పరిగణనలోకి వచ్చినప్పటికీ సెలక్టర్లు ధోనీ వైపు మొగ్గు చూపారు.
రెండు ప్రపంచకప్‌లు (2007, 2011) గెలిచిన జట్టులో సభ్యుడు అయినప్పటికీ హర్భజన్ కూడా కెప్టెన్సీకి దూరంగానే ఉండిపోయాడు. భజ్జీ తన సుదీర్ఘ కెరీర్‌లో 103 టెస్ట్‌లు, 236 వన్డేలు, 28 టీ-20లు ఆడాడు.
టీమీండియా ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన వీవీఎస్ లక్ష్మణ్ కూడా టీమిండియాకు నాయకత్వం వహించలేకపోయాడు.
టీమిండియా స్టార్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జహీర్ ఖాన్ కూడా కెప్టెన్ కాలేకపోయాడు.
2011 నుంచి టీమీండియా ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగుతున్నప్పటికీ కెప్టెన్ అయ్యే ఛాన్స్ మాత్రం అశ్విన్‌కు దక్కలేదు. కనీసం వైస్-కెప్టెన్‌గా కూడా అశ్విన్ పని చేయలేదు.