బిహార్‌లోని రాజ్‌గిర్‌ వేదికగా మహిళల ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీ జరుగుతోంది

జపాన్‌తో జరిగిన సెమీపైనల్‌లో భారత్‌ 2-0 తేడాతో గెలిచింది

లీగ్‌ దశలో వరుస విజయాలతో అజేయంగా ముందడుగు వేసిన సలీమా బృందం

సెమీ ఫైనల్‌లోనూ అదే దూకుడు కనబరిచింది

తొలి 3 క్వార్టర్స్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ నువ్వా నేనా అన్నంతగా సాగింది

ఇరు జట్లూ ఒక్క పాయింట్‌ కూడా చేయలేకపోయాయి

అయితే, ఉత్కంఠగా సాగిన నాలుగో క్వార్టర్‌లో భారత్‌ మహిళల బృందం 2 గోల్స్‌ వేసింది

చైనా, మలేసియా జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌లో 3-1 తేడాతో చైనా జట్టు విజయం సాధించింది

దీంతో ఫైనల్‌ పోరులో చైనా, భారత్‌ జట్లు తలపడనున్నాయి