రాహుల్‌ను తిట్టిన లఖ్‌నవూ ఓనర్ సంజీవ్ గోయెంకా గురించి తెలుసా?
గతేడాది ఐపీఎల్‌లో గుర్తుంచుకోదగిన ప్రదర్శన చేసిన లఖ్‌నవూ టీమ్ ఈ సీజన్‌లో మాత్రం నిరాశపరిచింది. వరుస ఓటములతో డీలా పడింది.
ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ ప్రదర్శన చాలా పేలవంగా ఉండడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
ఆ మ్యాచ్‌లో లఖ్‌నవూ ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. లఖ్‌నవూ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది.
ఆ మ్యాచ్‌లో ఓటమి అనంతరం కెప్టెన్ రాహుల్‌పై ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంకా గురించి ఆసక్తి మొదలైంది.
ఎల్‌ఎస్‌జీ ఓనర్ అయిన సంజీవ్ గోయెంకా ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఫౌండర్, ఛైర్మన్.
ప్రముఖ సూపర్ మార్కెట్ చైన్ అయిన స్పెన్సర్స్ ఈ గ్రూప్‌నకు చెందినదే.
ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ మొత్తం విలువ 50 వేల కోట్లకు పైమాటే. ఈ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ కోల్‌కతాలో ఉంటుంది.
ప్రముఖ స్నాక్స్ బ్రాండ్ ``టూ యమ్`` కూడా ఈ గ్రూప్‌నకు చెందినదే.
ఎల్‌ఎస్‌జీ మాత్రమే కాదు.. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టీమ్ మోహన్ బగన్ సూపర్ జెయింట్ కూడా సంజీవ్ గోయెంకాకు చెందినదే.