మను సంచలనం.. ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మను బాకర్ చరిత్ర సృష్టించింది. 

పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించిన మను.. చరిత్ర సృష్టించింది. 

22 ఏళ్ల మను బాకర్ 2002 ఫిబ్రవరి 18న హరియాణాలో జన్మించింది. ఈమె తండ్రి రామ్ కిషన్ నేవీలో చీఫ్ ఇంజినీర్‌గా పని చేసేవారు. 

14 ఏళ్ల వయసులోనే మను షూటింగ్‌పై ఆసక్తి ప్రదర్శించింది. ఆమె అడిగిన పిస్టల్ కొనిచ్చి తండ్రి అండగా నిలిచారు. అప్పట్లో ఆ పిస్టల్ ఖరీదు రూ.1.8 లక్షలు.

స్కూలు అయిపోగానే రోజుకు 25 కిలోమీటర్లు రైలు ప్రయాణం చేసి ఆమె షూటింగ్‌లో శిక్షణ పొందింది.

2020 టోక్యో ఒలింపిక్స్‌లో మను చేదు అనుభవం ఎదుర్కొంది. గన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆమె ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. 

మను బాకర్ ట్రైనింగ్ కోసం ప్రభుత్వం రూ.2 కోట్లు ఖర్చు పెట్టినట్టు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మను తన వ్యక్తిగత వివరాలను అందరితో పంచుకుంటుంది. జిమ్ వీడియోలను షేర్ చేస్తుంటుంది.