కెప్టెన్లకు బిగ్ చాలెంజ్.. అంత ఈజీ కాదు గురూ

లక్నో జట్టుకు సారథిగా రిషబ్ పంత్‌ను నియమించారు. ఆ టీమ్‌ తొలి కప్పు కలను అతడు నిజం చేస్తాడేమో చూడాలి

స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ జట్టు సారథ్య బాధ్యతలు మోస్తున్నాడు. పంజాబ్ ఫస్ట్ ట్రోఫీ డ్రీమ్ అతడు నెరవేరుస్తాడేమో చూడాలి

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా కంటిన్యూ అవుతున్నాడు యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్

ఐపీఎల్-2025 కెప్టెన్స్‌లో ఏకైక ఫారెన్ ప్లేయర్ ఉన్నాడు. అతడే సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి ప్యాట్ కమిన్స్

రాజస్థాన్ రాయల్స్‌ను సంజూ శాంసన్ ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా ఉంటాడు. అయితే ఫస్ట్ 3 మ్యాచులు రియాన్ పరాగ్ సారథిగా వ్యవహరిస్తాడు

కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ సారథ్యంలో ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది ఢిల్లీ క్యాపిటల్స్

డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్‌ను మిస్టర్ కూల్ అజింక్యా రహానె కెప్టెన్‌గా లీడ్ చేయనున్నాడు

ముంబైకి హార్దిక్ పాండ్యా సారథిగా ఉన్నాడు. అయితే స్లో ఓవర్ రేట్ బ్యాన్ కింద ఫస్ట్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయనున్నాడు

వరుసగా రెండోమారు సీఎస్‌కేను లీడ్ చేయనున్నాడు రుతురాజ్ గైక్వాడ్. అతడితో పాటు పంత్, రహానె, అక్షర్ లాంటి కెప్టెన్ల మీద ఎక్కువ మంది ఫోకస్ ఉంది

కొత్త సారథి రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ కప్ డ్రీమ్‌ను నెవర్చుకునేందుకు రెడీ అవుతోంది