ఐదు బంతుల్లో 5 సిక్సర్లు.. మ్యాచ్ గ్రాండ్ విక్టరీ

టీ20 క్రికెట్ చరిత్రలో సిక్సర్ల పేరు చెబితే వెంటనే గుర్తుకొచ్చేది యువరాజ్ సింగ్

ఇంగ్లండ్ జట్టుపై అప్పట్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది యూవీ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు

ఈ రికార్డు నేటికి అలాగే ఉండటం విశేషం

తాజాగా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరణ్ పోలార్డ్ ఆఫ్ఘన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఊచకోత కోశాడు

ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి విధ్వంసం సృష్టించాడు

హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2024లో భాగంగా పోలార్డ్ ఈ ఘనతను సాధించాడు

ట్రెంట్ రాకెట్స్, సౌతర్న్ బ్రేవ్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో పోలార్డ్ ఐదు సిక్సర్లు బాది తమ జట్టును గెలిపించాడు

పోలార్డ్ కొట్టిన భారీ సిక్సర్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి