చార్జీకి 30 రూపాయల్లేవ్..  కట్ చేస్తే ఐపీఎల్‌ హీరో

ఒక్క మ్యాచ్‌తో ఓవర్‌నైట్ హీరో అయిపోయాడు ముంబై ఇండియన్స్ పేసర్ అశ్వనీ కుమార్.

పంజాబ్‌కు చెందిన అశ్వనీది పేద కుటుంబం. సైకిల్ మీదే గ్రౌండ్‌కు వెళ్తూ ఆట నేర్చుకున్నాడతను.

ప్రాక్టీస్‌కు ఆటోలో వెళ్లేందకు డబ్బుల్లేక తండ్రి దగ్గర రూ.30 అడిగేవాడట అశ్వనీ.

ఎంత బాగా బౌలింగ్ చేసినా కేకేఆర్, సీఎస్‌కే, రాజస్థాన్ జట్లు ఈ కుర్రాడ్ని పట్టించుకోలేదు.

ముంబై టీమ్ అశ్వనీకి చాన్స్ ఇచ్చింది. రూ.30 లక్షలు పెట్టి ఆక్షన్‌లో కొనుక్కుంది. నిన్న కేకేఆర్‌తో మ్యాచ్‌లో అతడ్ని ఆడించింది.

తొలి బంతికే రహానేను ఔట్ చేసిన అశ్వనీ.. ఆ తర్వాత రస్సెల్, రింకూ, మనీష్ పాండేను వెనక్కి పంపించాడు.

బుమ్రా, స్టార్క్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఈ స్థాయి వరకు వచ్చిన అశ్వనీ.. వాళ్ల రేంజ్‌కు చేరుకుంటాడో లేదో చూడాలి.