కాఫీ విత్‌ కరణ్‌ ఇంటర్వ్యూ నన్ను ఎంతో భయపెట్టింది: కేఎల్‌ రాహుల్‌ 

ఐదేళ్ల క్రితం ఈ షోలో స్టార్‌ క్రికెటర్లు కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా పాల్గొన్న విషయం తెలిసిందే.

 అయితే ఈ సమయంలో వీరిద్దరూ మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

వారిద్దరిపై బీసీసీఐ చర్యలు చేపట్టింది.

 రాహుల్‌, పాండ్యాలకు చెరో రూ. 20 లక్షల జరిమానా విధించడంతో పాటు సస్పెన్షన్‌ వేటు కూడా వేసింది.

స్కూల్లో నేనెప్పుడూ సస్పెండ్‌ కాలేదు. 

ఆ ఇంటర్వ్యూ తర్వాత జీవితంలో తొలిసారి శిక్షకు గురి కావాల్సి వచ్చిందని వివరించారు. 

నాటి ఉదంతాన్ని కేఎల్‌ రాహుల్‌ తాజాగా ఓ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు.

‘నేను ఎంతో సిగ్గరిని’ అని తెలిపారు.

‘టీమిండియాకు ఆడటం ప్రారంభించాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని అన్నారు. 

‘100 మంది ఎదుట కూడా నేను అనర్గళంగా మాట్లాడేవాడిని’ అని చెప్పారు.

ఇప్పుడు అలా చేయలేకపోతున్నానని  కేఎల్‌ రాహుల్‌ పేర్కొన్నారు.