ప్రపంచస్థాయి చెస్‌ పోటీల్లో భారత  ఆటగాళ్లు మళ్లీ సత్తా చాటారు

అమెరికా దేశం న్యూయార్క్ వాల్ స్ట్రీట్‌లో జరిగిన ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్-2024, 

బ్లిట్జ్‌ చెస్ ఛాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో కోనేరు హంపీ గెలిచారు

8.5 పాయింట్లతో ప్రత్యర్థి ఇండోనేషియా ప్లేయర్ ఇరిన్ ఖరిష్మా పై విజయం సాధించారు

పదకొండో రౌండ్‌ ఉత్కంఠగా సాగిన చివరికి కోనేరు హంపి గెలుపొందారు

2019లో మాస్కో వేదికగా జరిగిన మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను కోనేరు సొంతం చేసుకున్నారు

కాగా, ఇది ఆమెకు రెండో ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్

మహిళల విభాగంలో ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌ రెండుసార్లు గెలిచి కోనేరు హంపి రికార్డు సృష్టించారు