క్రికెట్‌లో ఎప్పుడూ చూడని ఓ అనూహ్య ఘటన తాజాగా చోటుచేసుకుంది.
24 గంటల వ్యవధిలో ముగ్గురు వేర్వేరు బ్యాటర్లు ఒకే స్కోరు చేసి నాటౌట్‌గా నిలిచారు.
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న శ్రేయస్ అయ్యర్.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 97 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ 97 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.
పాకిస్థాన్‌తో జరిగిన టీ20లో కివీస్ బ్యాటర్ సీఫర్ట్ 97 పరుగులతో టీమ్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
ఇలా ముగ్గురు విభిన్నమైన ఆటగాళ్లు ఒక రోజు వ్యవధిలో ఒకే రకమైన స్కోరు చేయడం, నాటౌట్‌గా నిలవడం, టీమ్స్‌ను గెలిపించడం ఇదే తొలిసారి కావొచ్చని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇది ఆ భగవంతుడు రాసిన స్క్రిప్ట్ అని.. లేకపోతే 24 గంటల వ్యవధిలో వేర్వేరు మ్యాచుల్లో ఇలా జరగడం ఏంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ లవర్స్.