ఒక్క మ్యాచ్ ఆడకుండా ప్రపంచకప్ సాధించిన జట్టు సభ్యులు వీళ్లే..!
సునీల్ వాల్సన్..
కపిల్ దేవ్ సారథ్యంలో 1983లో ప్రపంచకప్ సాధించిన భారత జట్టులో సునీల్ వాల్సన్ సభ్యుడు. ఆ టోర్నీలో సునీల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
జై ప్రకాష్ యాదవ్
2002లో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన భారత జట్టులో సభ్యుడైన జై ప్రకాష్ యాదవ్ ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
పియూష్ చావ్లా
ధోనీ సారథ్యంలో 2007లో టీ20 ప్రపంచకప్ సాధించిన టీమిండియాలో పియూష్ చావ్లా సభ్యుడు. ఆ టోర్నీ ఆసాంతం పియూష్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఇర్ఫాన్ పఠాన్
2013లో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన ఇండియన్ టీమ్‌లో సభ్యుడైన పఠాన్ ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
మురళీ విజయ్
2013లో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన ఇండియన్ టీమ్‌లో సభ్యుడైన మురళీ విజయ్ ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
అమిత్ మిశ్రా
2013లో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన ఇండియన్ టీమ్‌లో సభ్యుడైన అమిత్ ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
వినయ్ కుమార్
2013లో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన ఇండియన్ టీమ్‌లో సభ్యుడైన వినయ్ ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
సంజూశాంసన్
తాజాగా రోహిత్ సేన గెలిచిన టీ20 ప్రపంచకప్ జట్టులో సంజూ శాంసన్ కూడా ఉన్నాడు. అయితే అతడికి మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు.
యజ్వేంద్ర చాహల్
రెండో టీ20 ప్రపంచకప్ చేజిక్కించుకున్న టీమిండియా సభ్యుడైన చాహల్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు
యశస్వి జైస్వాల్
తాజా ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో యశస్వి జైస్వాల్ కూడా సభ్యుడు. అయితే కోహ్లీ ఓపెనింగ్ స్థానంలో దిగడంతో జైస్వాల్‌కు చోటు దక్కలేదు.