టీ20ల్లో రోహిత్, కోహ్లీ సాధించిన తిరుగులేని రికార్డులు ఇవే!
అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు రోహిత్ శర్మ. రోహిత్ ఇప్పటివరకు 159 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై సాధించిన విజయంతో కలిపి రోహిత్ సారథ్యంలోని టీమిండియా మొత్తం 50 విజయాలు సాధించింది. అన్ని విజయాలు సాధించిన కెప్టెన్ మరొకరు లేరు.
అంతర్జాతీయ టీ20ల్లో 200 సిక్స్‌లు కొట్టిన తొలి బ్యాటర్ రోహిత్. ఇప్పటివరకు రోహిత్ మొత్తం 205 సిక్స్‌లు బాదాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ రోహిత్ శర్మ. రోహిత్ మొత్తం 4231 పరుగులు చేశాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు (5) సాధించిన బ్యాటర్ రోహిత్. గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా 5 సెంచరీలు చేసి రోహిత్‌తో సమానంగా ఉన్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో 4 వేల పరుగుల మైలురాయిని దాటిన తొలి క్రికెటర్ విరాట్ కోహ్లీ.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (39) చేసిన క్రికెటర్‌గా బాబర్ ఆజామ్‌తో కలిసి తొలి స్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్`` అవార్డులు అందుకున్న క్రికెటర్ కోహ్లీ. ఇప్పటివరకు 15 సార్లు కోహ్లీ ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా నిలిచాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ``ప్లేయర్ ఆఫ్ ది సిరీస్`` అవార్డులు గెలుచుకున్నది కూడా కోహ్లీనే. ఇప్పటివరకు 7 సార్లు కోహ్లీ ``ప్లేయర్ ఆఫ్ ది సిరీస్``గా నిలిచాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అతి వేగంగా 3500 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీ.