IPL 2024: ఒక్క సీజన్‌లో మెరిసి మాయమైన ఆటగాళ్లు వీరే..!

పాల్ వాల్తాటీ 2011 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన వాల్తాటీ అద్భుతంగా ఆడి 463 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి పూర్తిగా తెరమరుగయ్యాడు. 

సౌరబ్ తివారీ 2010 సీజన్‌లో ముంబై ఇండియన్ తరఫున దూకుడుగా ఆడిన సౌరబ్ తివారీ మొత్తం 419 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆ దూకుడు కొనసాగించలేకపోయాడు. 

మన్‌ప్రీత్ గోనీ ఐపీఎల్ మొదటి సీజన్‌లో చెన్నై తరఫున బరిలోకి దిగిన మన్‌ప్రీత్ గోనీ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. పర్పుల్ క్యాప్ పోటీదారుల్లో ఒకడిగా నిలిచాడు. ఆ తర్వాత నిలకడ కోల్పోయాడు. 

తిరుమల శెట్టి సుమన్ ఐపీఎల్ తొలి రెండు సీజన్‌లలో తిరుమల శెట్టి సుమన్ అద్భుతమైన ట్యాలెంట్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత అదే ఫామ్ కొనసాగించకపోవడంతో 2013 నుంచి అతడిని ఎవరూ తీసుకోలేదు. 

కమ్రాన్ ఖాన్ ఐపీఎల్ తొలి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున కమ్రాన్ ఖాన్ మెరుగైన ప్రదర్శన చేశాడు. బంతితో రాణించాడు. అయితే ఆ తర్వాత అతడి ప్రదర్శన పేలవంగా మారింది.

రాహుల్ శర్మ 2011లో పుణె వారియర్స్ తరఫున ఆడిన రాహుల్ శర్మ బంతితో చక్కగా రాణించాడు. అయితే ఆ తర్వాత లయ కోల్పోయాడు. 

స్వప్నిల్ అస్నోద్కర్ తొలి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన స్వప్పిల్ అస్నోద్కర్ మంచి ప్రదర్శన చేశాడు. అయితే ఆ తర్వాత ఆ ఫామ్ కొనసాగించలేకపోయాడు. 

మన్వీందర్ బిస్లా 2010 నుంచి 2013 మధ్య మన్వీందర్ కేకేఆర్‌కు కీలక ఆటగాడిగా నిలిచాడు. అయితే 2013 తర్వాత అతడు తెరమరుగయ్యాడు.