అన్ని టీ-20 ప్రపంచకప్‌లూ ఆడిన ఈ ఆటగాళ్ల రికార్డులు తెలుసా? 

ఇప్పటివరకు జరిగిన మొత్తం 9 టీ-20 ప్రపంచకప్ ఎడిషన్లలో పాల్గొని పలు రికార్డులు సృష్టించిన ఆటగాళ్లు ఇద్దరు మాత్రమే.

ఇప్పటివరకు జరిగిన మొత్తం టీ-20 ప్రపంచకప్ ఎడిషన్లలో పాల్గొన్న ఇద్దరు ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. 

2007లో జరిగిన ప్రపంచకప్‌ సాధించిన టీమిండియాలో రోహిత్ శర్మ సభ్యుడు. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికాపై రోహిత్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 

అంతర్జాతీయ టీ-20ల్లో రోహిత్ చేసిన పరుగులు మొత్తం 3974. ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు రోహిత్. 

అంతర్జాతీయ టీ-20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడు రోహిత్. మొత్తం 5 సెంచరీలు సాధించాడు. 

రోహిత్‌తో సమానంగా మొత్తం 9 టీ-20 ప్రపంచకప్ ఎడిషన్లు ఆడిన ఆటగాడు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్. 

ఐసీసీ ర్యాకింగ్స్ ప్రకారం టీ-20ల్లో నెంబర్ వన్ ఆల్ రౌండర్‌గా షకీబ్ ప్రస్తుతం కొనసాగుతున్నాడు. 

అంతర్జాతీయ టీ-20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో షకీబ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు మొత్తం 145 టీ-20 వికెట్లు పడగొట్టాడు. 

బ్యాటింగ్‌లోనూ రాణించగలిగే షకీబ్ అంతర్జాతీయ టీ-20ల్లో ఇప్పటివరకు 2404 పరుగులు చేశాడు.