అనుష్క కంటే ముందు కోహ్లీ ఎవరెవరితో డేటింగ్ చేశాడో తెలుసా?
విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ చాలా ఏళ్లు ప్రేమాయణం సాగించి 2017 డిసెంబర్ 11వ తేదీన వివాహం చేసుకున్నారు.
దాదాపు ఏడేళ్లుగా వైవాహిక జీవితం గడుపుతున్న వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ జంటకు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అనుష్క శర్మతో ప్రేమ, పెళ్లి కంటే ముందు కోహ్లీ మరికొందరు హీరోయిన్లతో డేటింగ్ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
కన్నడ నటి సంజనా గల్రానీతో కోహ్లీ సన్నిహితంగా మెలిగాడు. 2011లో వీరిద్దరూ ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కలిసి కనిపించారు. అయితే తామిద్దరం స్నేహితులమేనని సంజన పేర్కొంది.
ఓ యాడ్ షూటింగ్ సందర్భంగా కలుసుకున్న కోహ్లీ, హీరోయిన్ తమన్నా కొద్ది కాలం పాటు డేటింగ్ చేసినట్టు పుకార్లు వచ్చాయి.
క్రికెట్ ప్రపంచానికి పూర్తిగా పరిచయం కాకముందు దక్షిణాది నటి సాక్షి అగర్వాల్‌తో కోహ్లీ డేటింగ్ చేసినట్టు సమాచారం.
2007 మిస్ ఇండియా విన్నర్ అయిన సారా జేన్ డయాస్‌తో కూడా కోహ్లీ చెలిమి చేశాడట. అయితే వీరి డేటింగ్ చాలా తక్కువ కాలంలో ముగిసిపోయినట్టు సమాచారం.
బ్రెజిల్‌కు చెందిన మోడల్ ఇసాబెల్లా లైట్‌తో కోహ్లీ రెండేళ్లు డేటింగ్ చేశాడట. 2012 నుంచి 2014 మధ్య వీరిద్దరూ ప్రేమాయణం సాగించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.