ఆటలు, క్రీడలు శారీరక శక్తిని ఎక్కువగా తీసుకుంటాయి. ఎడతెరిపి లేకుండా పరుగులు పెట్టడం, ఆటను కొనసాగించడం వల్ల శరీరంలోని ఎనర్జీ త్వరగా ఖర్చవుతుంది
అరటిపండులో ఉండే కార్బోహైడ్రేట్లు చాలా వేగంగా జీర్ణమై తక్షణ శక్తిని అందిస్తాయి. క్రీడాకారులు ఆటలో వేగాన్ని కొనసాగించాలంటే ఈ సహజ ఎనర్జీ సోర్స్ చాలా అవసరం.
ఆటల్లో శరీరానికి ఎక్కువ శ్రమ పడటం వల్ల ఎక్కువగా చెమట కరుగుతుంది. చెమట ద్వారా సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు బయటకు వెళ్లిపోతాయి..
దీని వల్ల కండరాలు పట్టేసే సమస్యలు రావచ్చు. అరటిపండులో ఉన్న పొటాషియం శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను తిరిగి సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
ఆటల్లో ఒత్తిడి అనేది సహజం. గెలుపోటముల భయం, శారీరక శ్రమ వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అరటిపండులో ఉన్న ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం శరీరంలో సెరోటోనిన్ స్థాయిని పెంచుతుంది..
ఇది మనసుకు ప్రశాంతతను అందించి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
అరటిపండు శరీరానికి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. దీని వల్ల క్రీడాకారులు ఆటలో ఎక్కువ సేపు అలసటను అనుభవించకుండా చురుకుగా ఉండగలుగుతారు.