Share News

Mumbai Indians: మొత్తం ముంబై జట్టుకి పెద్ద షాక్.. హార్దిక్ పాండ్యాకి భారీ దెబ్బ

ABN , Publish Date - May 01 , 2024 | 03:11 PM

ముంబై ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీల్లో ఒకటి. ఈ జట్టు బరిలోకి దిగిందంటే చాలు.. ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. ఇప్పటివరకూ ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కి సమానంగా ఐదు టైటిళ్లను...

Mumbai Indians: మొత్తం ముంబై జట్టుకి పెద్ద షాక్.. హార్దిక్ పాండ్యాకి భారీ దెబ్బ
Mumbai Indians Team Penalised For Code Of Conduct Breach

ముంబై ఇండియన్స్ (Mumbai Indians).. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (IPL) మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీల్లో ఒకటి. ఈ జట్టు బరిలోకి దిగిందంటే చాలు.. ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. ఇప్పటివరకూ ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కి (Chennai Super Kings) సమానంగా ఐదు టైటిళ్లను సొంతం చేసుకుంది. అలాంటి ముంబై.. ఈ సీజన్‌లో మాత్రం పూర్తిగా మెత్తబడింది. ఒకప్పుడు తిరుగులేని బలమైన జట్టుగా పేరొందిన ముంబై ఇప్పుడు బాగా బలహీనపడింది. ఆటగాళ్లు సరిగ్గా ప్రదర్శించకపోవడం ఒక కారణంగా.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) పేలవ కెప్టెన్సీ మరో కారణం. అతడు తీసుకున్న ఎన్నో తప్పుడు నిర్ణయాల కారణంగా.. ఈ సీజన్‌లో ముంబై ఘోరంగా నిష్క్రమించింది. ఈ అవమానం చాలదంటూ.. ఈ జట్టుకి మరో ఊహించని షాక్ తగిలింది. అలాగే.. కెప్టెన్ పాండ్యాకు సైతం భారీ దెబ్బ పడింది.


ప్రపంచకప్‌లో రింకూ సింగ్‌కు అందుకే చోటు కల్పించలేదేమో: సునీల్ గవాస్కర్

మంగళవారం ఏకన స్పోర్ట్స్ సిటీ మైదానం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో (Lucknow Super Giants) జరిగిన మ్యాచ్‌లో.. ముంబై ఇండియన్స్ స్లో ఓవర్‌రేట్‌ని మెయింటెయిన్ చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు నిర్ణీత సమయంలో ఓవర్లు (20 ఓవర్ల కోటా) పూర్తి చేయలేదు. ఈ సీజన్‌లో ముంబై జట్టు ఇలా స్లో ఓవర్‌రేట్‌తో బౌలింగ్ చేయడం ఇది రెండోసారి. దీంతో.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.24 లక్షల జరిమానా విధించారు. అలాగే.. ఇంపాక్ట్ ప్లేయర్‌తో కలిపి మిగతా ఆటగాళ్లకు రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం చొప్పున కోత విధించడం జరిగింది. స్లో ఓవర్‌రేట్‌ని కొనసాగించినందుకు.. కెప్టెన్ పాండ్యాతో పాటు మొత్తం ముంబై జట్టుకి ఈ ఫైన్ విధించామని ఐపీఎల్ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ రెండోసారి స్లో ఓవర్‌రేట్‌తో బౌలింగ్ చేయడం వల్ల, హార్దిక్‌కి రూ.24 లక్షల జరిమానా విధించబడిందని స్పష్టం చేశారు.

నాకు మహేష్‏బాబు నటన, హైదరాబాద్‌ బిర్యానీ అంటే ఇష్టం..

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 144 పరుగులు మాత్రమే చేసింది. నేహాల్ వధేరా (46), టిమ్ డేవిడ్ (35), ఇషాన్ కిషన్ (32) నెట్టుకురావడంతో.. ముంబై జట్టు ఆమాత్రం స్కోరు చేయగలిగింది. లక్ష్య ఛేధనలో భాగంగా.. లక్నో జట్టు 19.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి, మ్యాచ్ కైవసం చేసుకుంది. మార్కస్ స్టోయినిస్ (62) అద్భుతంగా రాణించడం వల్లే లక్నో ఈ విజయాన్ని సొంతం చేసుకోగలిగింది. అతనికి కేఎల్ రాహుల్ (28) కూడా సహకారం అందించాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 01 , 2024 | 03:36 PM