Healthy Hair: ఆరోగ్యకర జుట్టు కోసం ఇలా చేయండి

ABN , First Publish Date - 2023-07-22T11:38:48+05:30 IST

అలొవెరా, కొబ్బరినూనె కలిపి జుట్టుకు పట్టిస్తే ఆరోగ్యంతో పాటు జుట్టు మూలాలు బలమైనవిగా తయారవుతాయి.

Healthy Hair: ఆరోగ్యకర జుట్టు కోసం ఇలా చేయండి

బౌల్‌లో రెండు టీస్పూన్ల వేపపొడి, రెండు టీస్పూన్ల శనగపిండి వేసి అందులో కొద్దిగా పెరుగు వేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే జుట్టులో మెరుపు వస్తుంది.

  • ఆవాలనూనె టీస్పూన్‌, టేబుల్‌ స్పూన్‌ పెరుగు, కొద్దిగా నిమ్మరసం వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించి ఇరవై నిముషాల పాటు ఉంచాలి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.

  • ఉసిరిపొడిని కొబ్బరి నూనెతో కలిపిన మిశ్రమాన్ని పట్టిస్తే తలలో రక్తం సరఫరా బాగా జరుగుతుంది. దీని వల్ల హెయిర్‌ గ్రోత్‌ పెరుగుతుంది.

  • మీ దగ్గర ఎలాంటి హెయిర్‌ ఇంగ్రిడియంట్స్‌ లేకుంటే కప్పులో నిమ్మరసం తీసుకుని జుట్టు అంతా పట్టించాలి. ఇలా చేస్తే కాస్త మంట వచ్చినట్లు అనిపిస్తుంది. సిట్రిక్‌ యాసిడ్‌ కాబట్టి మంచిదే. ఫ్రెష్‌గా అనిపిస్తుంది. దీంతో పాటు జుట్టు రాలిపోవటం ఆగిపోతుంది.

  • ఉసిరి రసం, కొబ్బరి నూనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని కలపాలి. దీన్ని పట్టించిన అరగంటకు జుట్టును మైల్డ్‌ షాంపూతో కడిగేయాలి. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

  • పుదీనా పేస్ట్‌ తలకు పట్టిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

  • అలొవెరా, కొబ్బరినూనె కలిపి జుట్టుకు పట్టిస్తే ఆరోగ్యంతో పాటు జుట్టు మూలాలు బలమైనవిగా తయారవుతాయి.

Updated Date - 2023-07-22T11:38:48+05:30 IST