Home » LATEST NEWS
తిరుపతి వేదికగా ఆధ్యాత్మికత, ఆధునిక విజ్ఞానాల అపూర్వ సంగమం ఆవిష్క్రుతమైంది. సంస్కృత విశ్వవిద్యాలయంలో 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో జరిగిన చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నిందితుడు రవికుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ ఒక మధ్యంతర నివేదికను విడుదల చేసింది.
కోడిపందాలు నిర్వహించేందుకు అనుమతుల కోసం ప్రజాప్రతినిధుల ద్వారా పోలీసులపై పందెం నిర్వాహకులు ఒత్తిడి తెస్తున్నారు. పందాలాబరుల కోసం స్థలాలను వెతుకుతున్నారు. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టేవారి కోసం ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణను చలిపులి వణికిస్తోంది. భానుడి భగభగలు మాయమై.. ఎముకలు కొరికే చలి పంజా విసురుతోంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నారు. వీటికి తోడు చల్లటి గాలులు సైతం వీస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్దులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తిరుపతిలోని జాతీయ సంస్కృత విద్యాలయంలో ఏడో భారతీయ సమ్మేళనం ఈ రోజు అంటే..శుక్రవారం ప్రారంభంకానుంది. ఈ సమ్మేళనం నాలుగురోజుల పాటు జరగనుంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఎంతటి వాయు కాలుష్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్ మహా నగరంలోనూ వాయు కాలుష్యం విజృంభిస్తోంది.
దేశ విమానయాన రంగంలో పెను మార్పులకు రంగం సిద్ధమవుతోంది. కేవలం రెండు సంస్థల గుత్తాధిపత్యం నుంచి విమానయాన రంగం బయటపడబోతోంది.
శ్రీశైలం టోల్ గేట్ వద్ద చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రెండు వందల కేజీల మాంసాహారం పట్టుబడింది. చికెన్, మటన్‌తో పాటు మద్యం కూడా పట్టుబడింది.
కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. బెంగుళూర్ నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 17 మంది సజీవదహం అయ్యారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చరిత్ర ఇక ముగిసిన కథేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చ్‌లలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా సాగిన అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర అమరావతిలోని వేంకటపాలెం వద్ద ముగియనుంది. నేడు వాజ్‌పేయ్ కాంస్య విగ్రహావిష్కరణతో పాటు స్మృతి వనం ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల పరిధిలో పెను ప్రమాదం తప్పింది. ఓ బస్సు పట్టాలు దాటుతూ మధ్యలోనే ఆగిపోయింది. ప్రయాణికులు సకాలంలో స్పందించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏఐతో కాపీ చేస్తూ ఇద్దరు అభ్యర్థులు దొరికిపోయారు. హర్యానాకు చెందిన అనిత్, సతీష్ అనే యువకులు అరెస్ట్ అయ్యారు. హెచ్‌సీయూ అధికారులు నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకానికి సంబంధిచి పరీక్షలు నిర్వహించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇప్పటం గ్రామంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులను కలిశారు.
శ్రీహరికోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM-3 M6 బాహుబలి ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూ బర్డ్ బ్లాక్-2ను ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో ప్రయోగించింది.