Marriage: పెళ్లిలో ఏడు సార్లే ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు..? 5 సార్లో, 9 సార్లో ఎందుకు చేయరు..?

ABN , First Publish Date - 2023-08-02T15:57:02+05:30 IST

చివరి ఏడవ ప్రదక్షిణతో, జంట సహచర్యం, కలిసి ఉండడం, విధేయత, అవగాహన కోసం దేవుడిని ప్రార్థిస్తారు.

Marriage: పెళ్లిలో ఏడు సార్లే ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు..? 5 సార్లో, 9 సార్లో ఎందుకు చేయరు..?

పెళ్ళి అనే తంతు ఒక్కో మతంలో ఒక్కోలా, ఒక్కో సాంప్రదాయంతో ఉంటుంది. హిందువుల్లోనే పెళ్ళితంతు పలు రకాలుగా ఉంటుంది. అయితే చివరిలో దంపతులిద్దరూ కలిసి ప్రదక్షిణ చేసే తంతుకు కూడా చాలా అర్థం ఉందట, అసలు ఏడు సార్లే ఎందుకు ఈ ప్రదక్షిణలు చేస్తారో దంపతులు మీకు తెలుసా.. 5, 9 సార్లో ఎందుకు చేయరు. 360 డిగ్రీల వృత్తాన్ని పూర్ణ సంఖ్యలతో భాగించలేని 0 నుండి 9 వరకు ఉన్న ఏకైక సంఖ్య 7 కాబట్టి, వివాహిత జంటలు, నవ దుంపతులు అగ్నిని ఏడుసార్లు (సాత్ ఫేర్)ప్రదిక్షణ చేసి వస్తారు.

కానీ వాస్తవానికి...

1. మొదటి ప్రదక్షిణలో, నూతన జంట పుష్కలంగా ఆహారం కోసం ప్రార్థిస్తారు.

2. రెండవ ప్రదక్షిణలో, దంపతులు ఆరోగ్యకరమైన, సంపన్నమైన జీవితం కోసం దేవుడిని ప్రార్థిస్తారు.

3. మూడవ ప్రదక్షిణలో, దంపతులు సంపద కోసం ప్రార్థిస్తారు.

4. నాల్గవ ప్రదక్షిణలో, దంపతులు ఒకరికొకరు వారి కుటుంబాల పట్ల ప్రేమ, గౌరవం పెరగాలని ప్రార్థిస్తారు.

ఇది కూడా చదవండి: మీరు వాడే మెడిసిన్స్.. అసలువా..? నకిలీవా..? ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా తెలుసుకోండిలా..!


5. ఐదవ ప్రదక్షిణతో, వధూవరులు కలిసి అందమైన, వీరోచితమైన స్వభావంతో, గొప్ప పిల్లల కోసం ప్రార్థిస్తారు.

6. ఆరవ ప్రదక్షిణతో, జంట ఒకరికొకరు శాంతియుతమైన సుదీర్ఘ జీవితాన్ని అడుగుతారు.

7. చివరి ఏడవ ప్రదక్షిణతో, జంట సహచర్యం, కలిసి ఉండడం, విధేయత, అవగాహన కోసం దేవుడిని ప్రార్థిస్తారు.

ఈ ఏడు ప్రదక్షిణలు ఏడు 360ని పూర్ణసంఖ్యలతో భాగించలేవు కానీ ఏడు దంపతులు ఏడు ప్రదక్షిణలు చేసి నూతన జీవితాన్ని ప్రారంభించేది. కలకాలం కలిసిమెలిసి కష్టసుఖాలలో భాగస్వాములై బ్రతకాలని మాత్రమే దీని అర్థం.

Updated Date - 2023-08-02T15:57:02+05:30 IST