Vastu Tips: ప్రతీ ఇంట్లోనూ తప్పనిసరిగా ఉండాల్సిన 7 మొక్కల లిస్ట్ ఇదీ.. వీటి వల్ల కలిగే లాభాలేంటో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!

ABN , First Publish Date - 2023-08-18T11:29:38+05:30 IST

లావెండర్ దాని సువాసన, ఒత్తిడిని తగ్గించడానికి ప్రసిద్ధి చెందింది. ఈ వాస్తు మొక్క మంచి శక్తిని ఆకర్షిస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా దెబ్బతిన్న నరాలకు ఉపశమనాన్నిఇస్తుంది.

Vastu Tips: ప్రతీ ఇంట్లోనూ తప్పనిసరిగా ఉండాల్సిన 7 మొక్కల లిస్ట్ ఇదీ.. వీటి వల్ల కలిగే లాభాలేంటో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!
Lavender Plant

ప్రతి ఇంటికీ కళను తెచ్చేవి మొక్కలే.. దైవత్వాన్ని పెంచే తులసి, తమలపాకు నుంచి, మనీకి లోటుండదనే మనీ ఫ్లాంట్ వరకూ అన్నీ ఇంటి ఆవరణలో అందంగా అమర్చుకునే మొక్కలు. ఇవి ఇంటికి కళతోపాటు, మంచి పాజిటివ్ ఎనర్జీని, స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. మొక్కలు స్థలం మానసిక స్థితిని వేగంగా పెంచుతాయి, అలాగే సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. మొక్కలను ఇంటి ఆవరణలో, వ్యాపార సముదాయాల్లో ఉంచడం వల్ల వాస్తు ప్రకారం అనేక ప్రయోజనాలు ఉంటాయి. సామరస్యం, ఆరోగ్యం, విజయం, సానుకూల శక్తులను ఆకర్షించడానికి అనేక మొక్కలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఇంటి ఆవరణలోనూ తప్పక ఉండాల్సిన 7 వాస్తు మొక్కలు ఇవి.

ఇంట్లో ఉంచుకోవలసిన టాప్ 7 వాస్తు మొక్కలు

1. మనీ ప్లాంట్: మనీ ప్లాంట్‌లు విజయాన్ని, సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు. ఇది కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని చాలామంది నమ్మకం. ఈ మొక్కను పెంచేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానిని ఆగ్నేయం వైపు ఉంచాలి. అలాగే ఈ మొక్కను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు.

2. తులసి మొక్క: తులసి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మొక్క. మంచి ఆరోగ్యం, సంపదను తీసుకురావడానికి ఈ మొక్క సాధారణంగా భారతీయుల గృహాల ప్రవేశ మార్గానికి సమీపంలో కనిపిస్తుంది. తులసిని, వృందా దేవి అని కూడా పిలుస్తారు, పురాతన హిందూ గ్రంధాల ప్రకారం సంపద దేవత లక్ష్మి రూపమై అదృష్టాన్ని కూడా తెస్తుంది.

3. వెదురు మొక్క: వాస్తు ప్రకారం, వెదురు మొక్క ఇంటికి ఆనందం, అదృష్టం, కీర్తి, ప్రశాంతత, డబ్బును తెస్తుంది. దీనిని బహుమతిగా ఇవ్వచ్చు. దీనితో ఇల్లు, ఆఫీస్ డెస్క్‌ని అందంగా చేయవచ్చు.

4. వేప: ఔషధ మొక్క వేప సానుకూల శక్తిని పెంపొందిస్తుంది. అనేక వ్యాధులను నయం చేయడానికి ప్రసిద్ధి చెందింది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి వాయువ్య మూలలో వేప మొక్కను నాటాలి.

ఇది కూడా చదవండి: ఇంట్లో పూజా మందిరం అసలు ఏ దిశలో ఉండాలి..? వాస్తు శాస్త్రంలో అసలేం రాసి ఉందంటే..!


5. లావెండర్ ప్లాంట్: లావెండర్ దాని సువాసన, ఒత్తిడిని తగ్గించడానికి ప్రసిద్ధి చెందింది. ఈ వాస్తు మొక్క మంచి శక్తిని ఆకర్షిస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా దెబ్బతిన్న నరాలను ఉపశమనాన్నిఇస్తుంది.

6. స్నేక్ ప్లాంట్: స్నేక్ ప్లాంట్ పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. ఇది ఆక్సిజన్ ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. కిటికీ పక్కన ఉన్న ప్రదేశంలో ప్రశాంత వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది.

7. ఆర్కిడ్లు: ఆర్చిడ్ శ్రేయస్సు, విజయానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇంటికి సానుకూలతను ఇవ్వడమే కాకుండా వాస్తు మొక్కలలో ఒకటిగా నిలిచింది.

Updated Date - 2023-08-18T11:29:38+05:30 IST