Joe Biden: బీచ్‌లో షర్ట్ లేకుండా బైడెన్.. 80 ఏళ్ల వయసులో హాలీవుడ్ హీరోలా.. నెట్టింట వైరల్‌గా మారిన ఫొటోలు!

ABN , First Publish Date - 2023-08-01T13:38:19+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) తాజా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బీచ్‌లో 80 ఏళ్ల వయసులో షర్ట్ లేకుండా (Without Shirt) ఆయన దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Joe Biden: బీచ్‌లో షర్ట్ లేకుండా బైడెన్.. 80 ఏళ్ల వయసులో హాలీవుడ్ హీరోలా.. నెట్టింట వైరల్‌గా మారిన ఫొటోలు!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) తాజా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బీచ్‌లో 80 ఏళ్ల వయసులో షర్ట్ లేకుండా (Without Shirt) ఆయన దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో ఆయన బేస్ బాల్ క్యాప్, సన్ గ్లాసెస్, నీలిరంగు టెన్నిస్ బూట్లు ధరించి హాలీవుడ్ యాక్షన్ హీరోలా కనిపిస్తున్నారు. ఎప్పుడూ బిజీ షెడ్యూల్‌తో తీరికలేకుండా గడిపే బైడెన్ తాజాగా డెలావేర్‌లోని రెహోబోత్ (Rehoboth) బీచ్‌లో ఇలా సరదాగా కాసేపు సమయాన్ని గడిపారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న జర్నలిస్ట్ ఎరిక్ గెల్లర్ (Eric Geller) తన కెమెరాతో ఫొటోలు తీసి, ట్విటర్‌లో షేర్ చేశారు. "ప్రెసిడెంట్ బైడెన్ ఇక్కడి రెహోబోత్‌లో అందమైన బీచ్ డేని ఆనందిస్తున్నారు" అనే లైన్‌తో ఎరిక్ ఈ ఫొటోలను ట్వీట్ చేశారు. అంతే.. యూఎస్ అధ్యక్షుడి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) ను షేక్ చేస్తున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు ప్రెసిడెంట్.. హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు.

Shocking Incident: మెల్‌బోర్న్‌లో ఘోరం.. బర్త్‌డే నాడు భారతీయ టీనేజర్‌పై పాశవిక దాడి!


Updated Date - 2023-08-01T13:38:19+05:30 IST