Mega Millions: లక్​ అంటే నీదే బాసూ.. లాటరీలో రూ.13వేల కోట్ల జాక్​పాట్​!

ABN , First Publish Date - 2023-08-10T10:35:40+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తికి మెగా మిలియన్స్ (Mega Millions) లాటరీ రూపంలో లక్ కలిసొచ్చింది. దాంతో ఏకంగా 1.58 బిలియన్ డాలర్ల జాక్‌పాట్ కొట్టారు.

Mega Millions: లక్​ అంటే నీదే బాసూ.. లాటరీలో రూ.13వేల కోట్ల జాక్​పాట్​!

Mega Millions: అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తికి మెగా మిలియన్స్ (Mega Millions) లాటరీ రూపంలో లక్ కలిసొచ్చింది. దాంతో ఏకంగా 1.58 బిలియన్ డాలర్ల జాక్‌పాట్ కొట్టారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.13వేల కోట్లు. నెఫ్యూన్ బీచ్‌‌లోని పబ్లిక్స్ స్టోర్ యజమాని ఈ టికెట్‌ను విక్రయించారు. లాటరీ నిర్వాహకులు మంగళవారం డ్రా నిర్వహించగా.. అందులో 13, 19, 20, 32, 33, 14 నంబరు టికెట్‌కు ఈ జాక్‌పాట్ దక్కింది. అయితే, విజేత వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా, అమెరికా చరిత్రలో మూడో అతిపెద్ద లాటరీ ప్రైజ్‌మనీ ఇదేనని అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

ఇక డ్రాలో గెలుపొందిన వ్యక్తికి ఈ 13వేల కోట్లను సంవత్సరానికి కొంత మొత్తం చొప్పున 30 ఏళ్ల పాటు చెల్లిస్తారు. అలా కాకుండా ఒకేసారి ఈ మొత్తం కావాలంటే మాత్రం అతనికి సుమారు రూ.6,488కోట్లు వస్తాయి. కామన్‌గా చాలా మంది విజేతలు ఇలా ఒకేసారి తీసుకెళ్లడానికే మొగ్గుచూపుతుంటారని ఈ సందర్భంగా లాటరీ నిర్వహకులు తెలిపారు. ఇదిలాఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇదే లాటరీలో 2.04 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19వేల కోట్లు) గెలుచుకున్నారు. మెగా మిలియన్స్ లాటరీ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధిక ప్రైజ్‌మనీ. అలాగే అగ్రరాజ్యం చరిత్రలో కూడా ఇదే అతిపెద్ద లాటరీ ప్రైజ్‌మనీ.

Heartbroken: అయ్యో పాపం.. పదేళ్ల తర్వాత కొడుకును వెతుక్కుంటూ యూఏఈ వెళ్లిన భారతీయ దంపతులు.. చివరికి

Updated Date - 2023-08-10T10:37:23+05:30 IST