Share News

UAE Golden Visa: యూఏఈ ఇచ్చే గోల్డెన్ వీసాతో బోలెడు బెనిఫిట్స్.. నివాసం నుంచి వ్యాపారం వరకు ప్రవాసులకు కలిగే ప్రయోజనాలివే..!

ABN , First Publish Date - 2023-11-11T06:48:56+05:30 IST

వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం మంజూరు చేసేదే గోల్డెన్ వీసా. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది.

UAE Golden Visa: యూఏఈ ఇచ్చే గోల్డెన్ వీసాతో బోలెడు బెనిఫిట్స్.. నివాసం నుంచి వ్యాపారం వరకు ప్రవాసులకు కలిగే ప్రయోజనాలివే..!

అబుధాబి: వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం మంజూరు చేసేదే గోల్డెన్ వీసా. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసా 10, 5ఏళ్ల కాలపరిమితో ఉంటుంది. అంతేగాక ఆటోమెటిక్‌గా పునరుద్ధరించబడుతుంది. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనంకు వీలు కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇలా ఎమిరేట్స్ జారీచేసే ఈ గోల్డెన్ వీసాతో కలిగే ఎనిమిది అద్భుతమైన ప్రయోజనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Pakistan: పాకిస్తాన్ పౌరులకు మరో కొత్త కష్టం.. ఉన్నట్టుండి పాస్‌పోర్టుల జారీనీ ఆ దేశం ఎందుకు బంద్ చేసిందంటే..!

1. దీర్ఘకాలిక, పునరుత్పాదక నివాసం

గోల్డెన్ వీసా ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి.. ఈ వీసాదారులు పదేళ్ల పాటు చెల్లుబాటు అయ్యే పునరుత్పాదక నివాస వీసాపై యూఏఈ (UAE) లో నివసించడానికి అనుమతిస్తుంది. మీరు వీసా కోసం మొదట దరఖాస్తు చేసిన కేటగిరీకి సంబంధించిన అర్హత ప్రమాణాలను పూర్తి చేసినంత కాలం మీరు వీసాను పునరుద్ధరించుకునే వెసులుబాటు ఉంటుంది.

2. స్పాన్సర్ లేదా యజమాని అవసరం లేదు

సాధారణంగా యూఏఈలో నివాస వీసాలకు స్పాన్సర్ అవసరం. అది మీకు ఉద్యోగం చేస్తున్న కంపెనీ (వర్క్ వీసా విషయంలో) లేదా ఇప్పటికే ఆ దేశంలో నివాసం ఉన్న కుటుంబ సభ్యుడు కావచ్చు (ఫ్యామిలీ వీసా). అయితే, యూఏఈ యొక్క వీసా వ్యవస్థలో కొత్త మార్పులు గోల్డెన్ వీసాతో సహా స్వీయ-ప్రాయోజిత వీసా ఆప్షన్స్‌ను ప్రవేశపెట్టాయి. గోల్డెన్ వీసా కలిగి ఉండటం వల్ల ఉద్యోగాలను మరింత సులభంగా మార్చగలిగే కార్మికులకు ఎంతో సహాయపడుతుంది. ఎందుకంటే వారి మునుపటి యజమాని స్పాన్సర్ చేసిన వారి నివాస వీసాను రద్దు చేయవలసిన అవసరం లేదు.

3. ఆరు నెలల కంటే ఎక్కువ కాలం యూఏఈ వెలుపల ఉన్నా కూడా నివాస వీసా రద్దు కాదు

గోల్డెన్ వీసాదారులు యూఏఈ వెలుపల ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉండగలిగే వెసులుబాటును కలిగి ఉంటారు. సాధారణంగా నివాసి ఆరు నెలల కంటే ఎక్కువ కాలం దేశం వెలుపల ఉంటే నివాస వీసా అనేది రద్దు చేయబడుతుంది.

Golden Visa: యూఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు 3 సులువైన మార్గాలు.. అది కూడా నాన్-రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా..

4. కుటుంబ సభ్యులను స్పాన్సర్ చేయడానికి మెరుగైన ఎంపికలు

కొత్త వీసా విధానం ప్రవాసులందరూ 25 ఏళ్లలోపు మగ పిల్లలను స్పాన్సర్ చేయడానికి అనుమతిస్తుంది. కానీ మీరు గోల్డెన్ వీసాదారులు అయితే మాత్రం 10 ఏళ్ల రెసిడెన్సీని కలిగి ఉండటం వలన ప్రతి కొన్ని సంవత్సరాలకు రెసిడెన్సీని రెన్యువల్ చేయకుండా నివారించవచ్చు. అలాగే గోల్డెన్ వీసా వ్యవస్థ ప్రాయోజిత కుటుంబ సభ్యులకు గోల్డెన్ వీసా ప్రాథమిక హోల్డర్ మరణిస్తే, ప్రాయోజిత సభ్యుల అనుమతి చెల్లుబాటు అవుతుందని హామీ ఇస్తుంది.

5. మీరు స్పాన్సర్ చేయగల గృహ కార్మికులపై ఎలాంటి పరిమితి ఉండదు

గోల్డెన్ వీసా మీరు ఎంత మంది గృహ సహాయకులనైనా స్పాన్సర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

6. గోల్డెన్ వీసా దరఖాస్తుదారుల కోసం ప్రత్యేక బహుళ-ప్రవేశ వీసా

మీకు ఇంకా గోల్డెన్ వీసా లేకుంటే, ప్రస్తుతం యూఏఈలో నివాసం లేకుంటే మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేక ఆరు నెలల బహుళ-ప్రవేశ విజిట్ వీసా ఉంటుంది. ఇది మీరు యూఏఈకి వచ్చి దరఖాస్తు తాలూకు పేపర్ వర్క్‌ను పూర్తి చేయడానికి అనుమతిస్తుంది.

GCC: గల్ఫ్ దేశాలకు వెళ్లే టూరిస్టులకు పండగలాంటి వార్త.. ఇకపై..

7. లెస్సన్స్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు

మీరు మీ దేశానికి చెందిన చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న దుబాయ్‌ గోల్డెన్ వీసా హోల్డర్ అయితే, మీరు నేరుగా యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఎలాంటి డ్రైవింగ్ లెస్సన్స్ అవసరం లేకుండానే దుబాయ్‌లోని డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత మీరు రెండు పరీక్షలలో ఉత్తీర్ణులైతే చాలు.. మీరు యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్‌ని పొందవచ్చు.

8. ప్రత్యేకమైన ఆరోగ్య బీమా ప్యాకేజీలు

దుబాయ్, అబుదాబిలో ఫుల్ టైమ్ ఉద్యోగులుగా ఉన్న గోల్డెన్ వీసాదారులు వారి యజమానికి సంబంధించిన ఆరోగ్య బీమా పాలసీ పరిధిలో కొనసాగుతారు. అయితే, విదేశాల్లో నివసించే పెట్టుబడిదారులు, ఫ్రీలాన్సర్లు, వ్యక్తులు వారి సొంత ఆరోగ్య బీమా పాలసీ కలిగి ఉండాలి. దీనిలో భాగంగా గోల్డెన్ వీసా హోల్డర్స్ (Golden Visa holders) కోసం నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద ఓ ప్రత్యేక ఆరోగ్య బీమా ప్లాన్‌ ఉంది. ఈ ప్యాకేజీ కోసం ప్రీమియంలు 2,393 దిర్హమ్స్ (రూ.54వేలు) నుండి ప్రారంభించవచ్చు. వార్షిక కవరేజ్ పరిమితి వచ్చేసి 3లక్షల దిర్హమ్స్ (రూ.67.97లక్షలు).

UAE family visit visa: యూఏఈ టూర్ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇది మీ కోసమే..!

Updated Date - 2023-11-11T06:49:01+05:30 IST