Share News

NRI: యూఎస్ బిగ్‌టెక్ తొలగింపులలో భారత హెచ్-1బీ వర్కర్లకు తీవ్ర అన్యాయం.. ఎన్నారైల గగ్గొలు

ABN , First Publish Date - 2023-10-18T06:52:49+05:30 IST

ఇటు ఇండియాతో పాటు అటు అగ్రరాజ్యం అమెరికాలోని టెక్ ఇండస్ట్రీకి (Tech Industries) ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. యూఎస్‌ (US) లో ప్రతికూల వ్యాపార ఫలితాలు, మహమ్మారి కారణంగా చాలా మంది టెక్ వర్కర్స్ తమ ఉద్యోగాలను కోల్పోయారు.

NRI: యూఎస్ బిగ్‌టెక్ తొలగింపులలో భారత హెచ్-1బీ వర్కర్లకు తీవ్ర అన్యాయం.. ఎన్నారైల గగ్గొలు

NRI: ఇటు ఇండియాతో పాటు అటు అగ్రరాజ్యం అమెరికాలోని టెక్ ఇండస్ట్రీకి (Tech Industries) ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. యూఎస్‌ (US) లో ప్రతికూల వ్యాపార ఫలితాలు, మహమ్మారి కారణంగా చాలా మంది టెక్ వర్కర్స్ తమ ఉద్యోగాలను కోల్పోయారు. వారిలో ఎక్కువమంది భారతీయులు ఉన్నారు. వీరిలో దాదాపు అందరూ హెచ్-1బీ (H1-B) అనే ప్రత్యేక వీసాతో అక్కడ పనిచేస్తున్నారు. ఇక హెచ్-1బీ వీసా (H1-B Visa) అనేది ఇతర దేశాల నుంచి నైపుణ్యం కలిగిన కార్మికులను పరిమిత కాలం వరకు అమెరికాలో (America) పని చేయడానికి అనుమతిస్తుందనే విషయం అందరికి తెలిసిందే.

హెచ్-1బీ వీసాలు ఉన్న టెక్ కార్మికులు (Tech Workers) తమ ఉద్యోగాలను కోల్పోయినప్పుడు, వారు త్వరగా మరో జాబ్ సంపాదించుకోవాలి. లేనిపక్షంలో అమెరికా వదిలి వెళ్లక తప్పదు. ఇది వారిని, వారి కుటుంబాలను తీవ్ర ఒత్తిడిలో నెడుతోంది. యూఎస్‌లో చాలా రోజులు ఉండి, ఉన్నట్టుండి వెళ్ళిపోవాలంటే చాలా కష్టమవుతుంది కూడా. అక్కడి ఇళ్లను విక్రయించాలి, పిల్లల స్కూల్స్ మార్చాలి. ఇలా జీవితం మొత్తం తలకిందులు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉద్యోగాలు కోల్పోయిన చాలా మంది హెచ్-1బీ వర్కర్లు టెక్ కంపెనీల (Tech Companies) లో కాకుండా వేరే కంపెనీలలో కూడా కొత్త జాబ్స్‌ వేగంగా పొందుతున్నారని కొందరు అంటున్నారు.

అయితే, మరికొందరు ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. ఇది అసలు నిజం కాదని చెబుతున్నారు. హెచ్-1బీ వీసా విధానం అన్యాయమని వాపోతున్నారు. ఈ విధానం కార్మికులు, ఆర్థిక వ్యవస్థ రెండింటినీ తీవ్రంగా దెబ్బతీస్తుందని వారు చెబుతున్నమాట. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో ఇమ్మిగ్రేషన్ (US Immigration) విధానాన్ని ఎలా మార్చాలి, ఇతర దేశాల నుంచి వచ్చే నైపుణ్యం కలిగిన వర్కర్లను ఇది ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. నిపుణులు సైతం ఈ విధానంపై పెదవి విరుస్తున్నారు.

US: గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే వార్త.. భారతీయులకు భారీ ప్రయోజనం

Updated Date - 2023-10-18T07:34:05+05:30 IST