NRI: అల్లుడిపై దాడి.. బ్రిటన్‌లో ఎన్నారైకి 8 ఏళ్ల జైలు శిక్ష..

ABN , First Publish Date - 2023-01-05T20:42:33+05:30 IST

అల్లుడిపై దాడిచేసిన భారతీయుడికి బ్రిటన్‌లో స్థానిక కోర్టు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బర్మింగ్‌హమ్ ప్రాంతంలో నివసించే భజన్ సింగ్ గత ఏప్రిల్‌లో మద్యం మత్తులో అల్లుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

NRI:  అల్లుడిపై దాడి..  బ్రిటన్‌లో ఎన్నారైకి 8 ఏళ్ల జైలు శిక్ష..

ఎన్నారై డెస్క్: అల్లుడిపై దాడిచేసిన భారతీయుడికి బ్రిటన్‌లో స్థానిక కోర్టు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బర్మింగ్‌హమ్ ప్రాంతంలో నివసించే భజన్ సింగ్ గత ఏప్రిల్‌లో మద్యం మత్తులో అల్లుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. భజన్ సింగ్ తన కూతురు అల్లుడు, వారి పిల్లలతో కలిసి ఉండేవాడు. మామ, అల్లుడు ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేసేవారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. వారు ఇద్దరూ సఖ్యతగానే ఉండేవారు. భజన్ భారత్ వెళ్లి వచ్చిన అనంతరం అల్లుడిపై దాడి చేశారు. తన కూర్చిలో కూర్చుని ఉండగా అకస్మాత్తుగా ఈ దాడి జరిగిందని బాధితుడు కోర్టుకు తెలిపాడు. తొలుత మెడ వెనుకవైపు దాడి జరగడంతో భజన్ సింగ్ తనను కొట్టి ఉంటాడని భావించినట్టు చెప్పుకొచ్చాడు. తరచి చూస్తే పెద్ద కత్తి గాయమైనట్టు తెలిసిందని వాపోయాడు. భజన్ సింగ్‌ను అడ్డుకోబోయే క్రమంలో మరో మారు అతడు దాడి చేయగా.. చేతి మధ్యవేలికి గాయమైందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. భజన్ సింగ్ ఇంతటి హింసాత్మకంగా దాడి చేయడం అసాధారణమని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. భజన్ ఇండియాకు వెళ్లిన సమయంలో ఏదో జరిగి ఉంటుందని కోర్టు ముందు అనుమానం వ్యక్తం చేశాడు.

Updated Date - 2023-01-05T20:42:35+05:30 IST