Share News

ఫ్రైడే

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:43 AM

ఎండ తీవ్రత, వడగాడ్పులతో జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. శుక్రవారం ఉదయం 8నుంచీ సాయంత్రం 5గంటల వరకు తీవ్ర వేడి వాతావరణం కొనసాగింది.తిరుపతి నగరంలో ఎండ తీవ్రతకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

ఫ్రైడే

రేణిగుంటలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత

24మండలాల్లో వడగాడ్పులతో ఠారెత్తిన జనం

తిరుపతి(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 19: ఎండ తీవ్రత, వడగాడ్పులతో జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. శుక్రవారం ఉదయం 8నుంచీ సాయంత్రం 5గంటల వరకు తీవ్ర వేడి వాతావరణం కొనసాగింది.తిరుపతి నగరంలో ఎండ తీవ్రతకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రేణిగుంటలో 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. తిరుపతి అర్బన్‌లో 43.4డిగ్రీలు, డక్కిలిలో 42.79, తిరుపతి రూరల్‌లో 42.23, వెంకటగిరిలో 42.09, ఏర్పేడులో 41.93, నాయుడుపేట, బాలాయపల్లి, తొట్టంబేడు, చంద్రగిరిల్లో 41.9 డిగ్రీలు,శ్రీకాళహస్తిలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 24మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యల్పంగా కోటలో 35.3,ఆలంపూడిలో 34.2డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 20 , 2024 | 01:43 AM