Share News

వలంటీర్లతో వైసీపీ రాజకీయం

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:39 AM

నేడు తిరుపతిలో చెవిరెడ్డి సమావేశం

వలంటీర్లతో వైసీపీ రాజకీయం

తిరుపతి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): చంద్రగిరి నియోజకవర్గంలో గౌరవ వేతనం తీసుకుంటూ ఇంతకాలం వలంటీర్లుగా వ్యవహరించిన వారంతా శనివారం పూర్తిగా విధుల నుంచీ తప్పుకున్నారు. వలంటీర్ల ముసుగు తొలగించి వందశాతం నిఖార్సైన వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారు. కొంతకాలంగా రోజుకు కొందరు చొప్పున వలంటీర్లు చేసిన రాజీనామాలను శనివారం అధికారులు ఆమోదించారు.ఆదివారం ఈ మాజీ వలంటీర్లతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సమావేశం కానున్నట్టు తెలిసింది. ఎన్నికల ప్రచారంలోకి పూర్తి స్థాయిలో వారిని దించేలా దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. రానున్న పదిహేను రోజులూ వారికి కీలక బాధ్యతలు అప్పగించనున్నారని, అందులో తాయిలాల పంపిణీయే ప్రధాన బాధ్యతగా వుంటుందని తెలిసింది. కాగా దీనిపై టీడీపీ వర్గాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. ఎమ్మెల్యే చెవిరెడ్డి మాజీ వలంటీర్ల కదలికలపై నిఘా వుంచినట్టు తెలిసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వారు ఎలాంటి కార్యక్రమం చేపట్టినా ఫిర్యాదు చేసి అడ్డుకునేందుకు సన్నద్ధమై వున్నట్టు తెలిసింది.

Updated Date - Apr 28 , 2024 | 01:39 AM