Share News

లారస్‌ ల్యాబ్స్‌ లాభంలో 26% వృద్ధి

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:17 AM

మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.76 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు లారస్‌ ల్యాబ్స్‌ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం 26 శాతం వృద్ధి చెందింది...

లారస్‌ ల్యాబ్స్‌ లాభంలో 26% వృద్ధి

మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.76 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు లారస్‌ ల్యాబ్స్‌ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం 26 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం కూడా 4 శాతం వృద్ధితో రూ.1,440 కోట్లుగా నమోదైంది. కొవిడ్‌ సంబంధిత ఉత్పత్తుల కొనుగోలు ఆర్డర్లు తగ్గుముఖం పట్టినప్పటికీ సంస్థకు చెందిన అన్ని వ్యాపార డివిజన్లు నిలకడైన పనితీరును కనబరచటం ఎంతగానో కలిసివచ్చిందని లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ సత్యనారాయణ చావా తెలిపారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ఒక్కో షేరుకు 40 పైసల మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,041 కోట్ల ఆదాయంపై రూ.161 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

Updated Date - Apr 26 , 2024 | 04:17 AM