కరారో ఇండియా రూ.1,812 కోట్ల ఐపీఓ
ABN , Publish Date - Aug 25 , 2024 | 05:36 AM
ట్రాన్స్‌మిషన్ సిస్టమ్స్ తయారీ కంపెనీ కరారో ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,812 కోట్ల మొత్తాలను సమీకరించేందుకు రెడీ అవుతోంది...
ట్రాన్స్‌మిషన్ సిస్టమ్స్ తయారీ కంపెనీ కరారో ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,812 కోట్ల మొత్తాలను సమీకరించేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్)గా ఉండనుంది. కరారో ఎస్‌పీఏ అనుబంధ సంస్థగా 1997లో కరారో ఇండియా ఏర్పాటైంది. ప్రస్తుతం కంపెనీ మహారాష్ట్రలోని పుణెలో రెండు ప్లాంట్లను నిర్వహిస్తోంది.