Share News

బంగారం, వెండి ఆభరణాల ఎగుమతిపై డ్రాబ్యాక్‌ రేట్లు సగానికి పైగా తగ్గింపు

ABN , Publish Date - Aug 25 , 2024 | 05:38 AM

పసిడి, వెండి ఆభరణాల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం డ్రాబ్యాక్‌ రేట్లను సగానికి పైగా తగ్గించింది. ఈసారి బడ్జెట్లో కేంద్రం ఈ విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా తగ్గించిన...

బంగారం, వెండి ఆభరణాల ఎగుమతిపై డ్రాబ్యాక్‌ రేట్లు సగానికి పైగా తగ్గింపు

న్యూఢిల్లీ: పసిడి, వెండి ఆభరణాల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం డ్రాబ్యాక్‌ రేట్లను సగానికి పైగా తగ్గించింది. ఈసారి బడ్జెట్లో కేంద్రం ఈ విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే. ఈ సవరణకు అనుగుణంగా డ్రాబ్యాక్‌ రేట్లనూ తగ్గించింది. రెవెన్యూ శాఖ శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. స్వర్ణాభరణాల్లో నికర బంగారంపై గ్రాముకు డ్రాబ్యాక్‌ రేటు రూ.704.1 నుంచి రూ.335.5కు తగ్గించారు. వెండి ఆభరణాలు, వెండి ఆర్టికల్స్‌లో నికర లోహంపై డ్రాబ్యాక్‌ రేటును కిలోకు రూ.4,468కి తగ్గించారు. ఈసారి బడ్జెట్లో గోల్డ్‌, సిల్వర్‌పై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు.

Updated Date - Aug 25 , 2024 | 05:38 AM