Share News

బీఓఎం లాభంలో 45% వృద్ధి

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:28 AM

మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 45 శాతం వృద్ధితో రూ.1,218 కోట్ల నికరలాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.840

బీఓఎం లాభంలో 45% వృద్ధి

ముంబై: మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 45 శాతం వృద్ధితో రూ.1,218 కోట్ల నికరలాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.840 కోట్లు. ఇదే కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.5,317 కోట్ల నుంచి రూ.6,488 కోట్లకు పెరిగింది. ఇందులో వడ్డీ ఆదాయం రూ.5,467 కోట్లుంది. స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 2.47 శాతం నుంచి 1.88 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.25 శాతం నుంచి 0.20 శాతానికి దిగి వచ్చాయి.

Updated Date - Apr 27 , 2024 | 05:28 AM