Share News

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.11,672 కోట్లు

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:57 AM

మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికాని (క్యూ4)కి ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 18.5 శాతం వృద్ధితో రూ.11,672 కోట్లకు చేరుకుంది...

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.11,672 కోట్లు

ముంబై: మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికాని (క్యూ4)కి ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 18.5 శాతం వృద్ధితో రూ.11,672 కోట్లకు చేరుకుంది. మొండిబకాయిలతో పాటు ఇతర అవసరాలకు కేటాయింపులు గణనీయంగా తగ్గడం ఇందుకు దోహదపడింది. కాగా, క్యూ4లో బ్యాంక్‌ స్టాండ్‌ఎలోన్‌ నికర లాభం 17.4 శాతం వృద్ధితో రూ.10,708 కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తానికి బ్యాంక్‌ స్టాండ్‌ఎలోన్‌ లాభం రూ.40,888 కోట్లకు పుంజుకుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఇది రూ.31,896 కోట్లుగా ఉంది.

  • నాలుగో త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) వార్షిక ప్రాతిపదికన 8.1 శాతం పెరిగి రూ.19,093 కోట్లకు చేరుకుంది.

  • సమీక్షా కాలానికి బ్యాంక్‌ కేటాయింపులు సగానికి పైగా తగ్గి రూ.718 కోట్లకు పరిమితమయ్యాయి. కాగా, డిపాజిట్లలో 19 శాతం, రుణాల్లో 19.4 శాతం వృద్ధి నమోదైంది.

  • గడిచిన మూడు నెలల్లో కొత్తగా రూ.5,139 కోట్ల రుణాలు మొండి పద్దుల్లోకి చేరాయి. అందులో రూ.4,900 కోట్లు రిటైల్‌ రుణాలేనని బ్యాంక్‌ తెలిపింది.

  • మార్చి 31 నాటికి బ్యాంక్‌ మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక ఆస్తులు (గ్రాస్‌ ఎన్‌పీఏ) 2.16 శాతానికి తగ్గాయి.

  • 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంక్‌ వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.10 డివిడెండ్‌ ప్రకటించింది.

వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.10 డివిడెండ్‌

Updated Date - Apr 28 , 2024 | 01:58 AM