Share News

తగ్గిన ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌ లాభం

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:54 AM

ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌.. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో నికర లాభం 10శాతం క్షీణించి రూ.724 కోట్లకు పరిమితమైంది. మొండి బకాయిల (ఎన్‌పీఏ)కు చేసిన కేటాయింపులు పెరగటమే...

తగ్గిన ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌ లాభం

ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌.. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో నికర లాభం 10శాతం క్షీణించి రూ.724 కోట్లకు పరిమితమైంది. మొండి బకాయిల (ఎన్‌పీఏ)కు చేసిన కేటాయింపులు పెరగటమే ఇందుకు కారణమని బ్యాంక్‌ పేర్కొంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్‌ నికర లాభం రూ.803 కోట్లుగా ఉంది. కాగా త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం మాత్రం రూ.7,822 కోట్ల నుంచి రూ.9,861 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో వడ్డీ ఆదాయం కూడా రూ.6,424 కోట్ల నుంచి రూ.8,219 కోట్లకు చేరుకుంది. మార్చి త్రైమాసికంలో స్థూల ఎన్‌పీఏలు 2.51 శాతం నుంచి 1.88 శాతానికి తగ్గగా నికర ఎన్‌పీఏలు కూడా 0.86 శాతం నుంచి 0.60 శాతానికి తగ్గినట్టు పేర్కొంది.

  • మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో వెల్‌ స్పన్‌ లివింగ్‌ రూ.2,616.70 కోట్ల ఆదాయంపై రూ.146 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఆదాయం 20 శాతం, లాభం 16 శాతం వృద్ధి చెందింది. సమీక్షా కాలంలో దేశీయ కన్స్యూమర్‌ వ్యాపారం 12.2 శాతం, ఫ్లోరింగ్‌ వ్యాపారం రెండింతలు పెరిగింది.

Updated Date - Apr 28 , 2024 | 01:54 AM